పయనించే సూర్యుడు జనవరి 04 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ భారత కమ్యూనిస్టు పార్టీ 1925 డిసెంబర్ 26న కాన్పూర్లో ఆవిర్భవించింది 2025 డిసెంబర్ 26 నాటికి భారత గడ్డపై సిపిఐ పార్టీకి వందేళ్లు అవుతున్నది ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా శతాబ్ది వార్షికోత్సవాలు జరుగుతున్నాయి అందులో భాగంగా జనవరి 18న ఖమ్మంలో జరిగే భారీ బహిరంగ సభకు ఇంటికో మనిషి ఊరుకో బండి ఖమ్మం రండి అనే కార్యక్రమాన్ని సిపిఐ చేపట్టింది ఈరోజు కొత్తూరు మండలం ఇనుమల్ నర్వ గ్రామంలో జీపు యాత్ర కార్యక్రమాన్ని చేపట్టింది ఈ కార్యక్రమాన్ని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు పానుగంటి పర్వతాలు బుద్ధుల జంగయ్య ప్రారంభించారు షాద్నగర్ లో శ్రీను మాట్లాడుతూ.. వందేళ్ళ చరిత్ర కలిగిన సిపిఐ పార్టీ భారతదేశంలో అనేక ఉద్యమాలకు ఊపిరి పోసిన పార్టీగా చరిత్ర సృష్టించిన ఎర్రజెండా నాటి రాజరిక వ్యవస్థలకు వ్యతిరేకంగా భూస్వాముల ఆగడాలు దౌర్జన్యాలకు వ్యతిరేకంగా నిలబడిన ఎర్రజెండా ప్రజలకు అండగా పోరాడిన పార్టీగా ఘనమైన చరిత్ర గలిగిన సిపిఐ పార్టీని ప్రజలు వందేళ్లుగా భారత నేలపై తెలుగు రాష్ట్రాల నేలపై కాపాడిన ప్రజలకు సిపిఐ కార్యకర్తలకు శ్రేణులకు ఆయన విప్లవ అభినందనలు తెలియజేశారు .నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి బాటలు వేసిన పార్టీ సిపిఐ పార్టీ ఆ పోరాటంలో లక్షలాది ఎకరాలను పేదలకు పంచి వేల గ్రామాలను విముక్తి చేసిన చరిత్ర కమ్యూనిస్టులది ఆ సాయిధ పోరాట ఉద్యమంలో వేలాదిమంది కమ్యూనిస్టులు అమరులై ప్రాణ త్యాగం చేశారని ఆయన కొనియాడారు.జనవరి 18న జరిగే బహిరంగ సభకు పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సీపీఐ ఫరూక్నగర్ మండల కార్యదర్శి లింగం నాయక్ ఏఐఎస్ ఎఫ్ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం పవన్ చౌహాన్ సీపీఐ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు