
పయనించే సూర్యుడు న్యూస్ 04-1-26, నాగరాజు రుద్రారపు సూర్యాపేట టౌన్ రిపోర్టర్ ఈ రోజు మహిళా విద్య కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయురాలు సావిత్రిబాయ్ ఫులే జయంతి సందర్భంగా పార్టీ ముఖ్య కార్యకర్తల సమక్షంలో పూలమాలతో నివాళులర్పించారు తెలంగాణ రాజ్యాధికార పార్టీ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి నల్గొండ జిల్లా ఇంచార్జ్ వట్టే జానయ్య యాదవ్ , మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ నీరజ గౌడ్ అ తర్వాత తెలంగాణ రాజ్యాధికార పార్టీలో పదవుల నియామక కార్యక్రమం నిర్వహించబడింది. పార్టీ ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో, తెలంగాణ రాజ్యాధికార పార్టీ మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీమతి నీరజ గౌడ్ కండవ కప్పి కొత్త నాయకులను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వట్టే జానయ్య యాదవ్ మాట్లాడుతూ జిల్లాలో పార్టీ బలోపేతం కోసం కార్యాచరణాత్మక కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. అలాగే నీరజ గౌడ్ మహిళల్లో రాజకీయ, సామాజిక చైతన్యం తీసుకువచ్చి రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ముందుకు వచ్చి పార్టీలో చేరాలని పిలుపునిచ్చారు. పదవుల నియామకాలు: సూర్యాపేట జిల్లా మహిళా అధ్యక్షురాలు – కొన్నె మంజుల జిల్లా ప్రధాన కార్యదర్శి – నారాయణదాసు కవిత సూర్యాపేట పట్టణ ఎస్టీ సెల్ అధ్యక్షుడు – ధరావత్ సేవ్యానాయక్ ఈ కార్యక్రమంలో మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రేసిడెంట్ నీరజ గౌడ్, జిల్లా అధ్యక్షుడు మామిడి అంజయ్య,ప్రధాన కార్యదర్శి మీర్ అక్బర్,పట్టణ అధ్యక్షుడు కుంభం నాగరాజు,ఆత్మకూరు (S)మండల పార్టీ అధ్యక్షుడు బొల్లె సైదులు,యువజన విభాగం అధ్యక్షుడు కోల కరుణాకర్ ముదిరాజ్, పట్టణ ప్రధాన కార్యదర్శి ఏశబోయిన మల్లేష్,బొమ్మగాని సైదులు, పగిళ్ల శరత్, లింగాల సైదులు,సేవ్యా నాయక్, కొన్నె మంజుల, నారాయణదాసు, కవిత కడియం వంశీ, మహేష్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని సావిత్రి బాయి పూలెకు ఘన నివాళులు అర్పించారు. ఆమె జయంతి సందర్భంగా విద్య, సమానత్వం, సామాజిక చైతన్యం పట్ల మరింత కృషి చేయాలని ప్రతిజ్ఞ చేశారు.