స్త్రీ విద్యకు పునాది సావిత్రిబాయి పూలే..

* ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా చదువుల తల్లి సావిత్రిబాయి పూలే 195వ జయంతి వేడుకలు

పయనించే సూర్యుడు జనవరి 4 ఎన్ రజినీకాంత్:- హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం భారతదేశ తొలి మహిళ ఉపాధ్యాయురాలు, సావిత్రిబాయి పూలే 195 వ జయంతి వేడుకలను ప్రజాసంఘాల ఆధ్వర్యంలో శనివారం ముల్కనూర్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముల్కనూర్ ప్రజా గ్రంధాలయం ఆవరణలోని జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానిక ముఖ్య అతిథులుగా మహనీయుల ఉత్సవ కమిటీ చైర్మన్ ముల్కనూర్ మాజీ ఉపసర్పంచ్, కొలుగూరి రాజు, జేఏసీ భీమదేవరపల్లి మండల చైర్మన్ డ్యాంగల సారయ్య, ముల్కనూర్ గ్రామ సర్పంచ్ జాలి ప్రమోద్ రెడ్డి హాజరై మాట్లాడుతూ భారతీయ సంఘ సంస్కర్త, ఉపాధ్యాయిని, రచయిత్రి. ఆమె నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన జ్యోతీరావ్ ఫూలే భార్య. కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమస్వరూపిణి, ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన ఆమె, తన భర్తతో కలసి 1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటగా బాలికల పాఠశాలను ప్రారంభించింది.[1] కుల వ్యవస్థకు, పితృస్వామ్యానికి వ్యతిరేకంగా, శూద్రుల, అస్పృశ్యుల, మహిళల సకల హక్కుల కోసం పోరాటం చేయటం తమ సామాజిక బాధ్యతగా ఆ దంపతులు విశ్వసించారు. నూతన వ్యవస్థ కోసం, ప్రాణాల్ని సైతం పణంగా పెట్టి సమష్టిగా పోరాటం చేసింది. సమాజంలోని కులతత్వం, పురుషాధిక్య ధోరణులు కలిగిన చాలామంది పండిత మేధావులందరికీ కూడా ఆమె కేవలం జ్యోతిరావు ఫూలే భార్యగా మాత్రమే తెలుసు. కానీ ఆమె ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు. [మూలం అవసరం] పీడిత ప్రజలు ముఖ్యంగా స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి అక్షరమే ఆయుధంగా అవమానాలను పూలదండలుగా మార్చుకొని భారత దేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులుగా చరిత్ర సృష్టించిన విప్లవ మూర్తి సావిత్రిబాయి పూలే వంటగది దాటి అడుగులు వేయించి అక్షర ధ్యానంతో మహిళ తరతరాలను మార్చి మహాతల్లి అణగారిన వర్గాల ఆశాజ్యోతి సావిత్రిబాయి పూలే అని అన్నారు. ఈ కార్యక్రమంలో ముల్కనూర్ ఉప సర్పంచ్ కాశగోని మమత బాలకృష్ణ, ఎమ్మార్పీఎస్ హుస్నాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ మాట్ల వెంకటస్వామి మాదిగ, మాజీ సర్పంచ్ మాడుగుల కొమురయ్య, ఆదరి రవీందర్, డాక్టర్ ఎదులాపురం తిరుపతి, కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు జక్కుల అనిల్ యాదవ్, బిఆర్ఎస్ మండల అధ్యక్షులు మండల సురేందర్, మాడుగుల అశోక్, మాడుగుల నరేందర్, మాడుగుల శ్రీనివాస్, మాడుగుల గోపి, మాడుగుల తిరుపతి, మాడుగుల యాదగిరి, అంబేద్కర్ సంఘ నాయకులు వెల్తురు ప్రేమ్ కుమార్, మాడుగుల చంటి, బొల్లంపల్లి సుకుమార్, దొంతరబో యిన రవీందర్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *