హిందూ ధర్మ రక్షణ మన బాధ్యత – సత్యానందగిరి స్వామి పిలుపు

పయనించే సూర్యుడు జనవరి 04 కాట్రేనికోన మండలం చిర్రయానం గ్రామంలో ఆర్ఎస్ఎస్ 100 శతవసంతోత్సవాల సందర్భంగా శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయ ప్రాంగణంలో హిందూ సమ్మేళనం నిర్వహించడం జరిగినది‌. ఈ సమ్మేళనంలో విశిష్ట అతిథిగా పేరవరం శ్రీ సద్గురు శ్రీకృష్ణ ఆశ్రమ పీఠాధిపతులు శ్రీ సత్యానందగిరి స్వామీజీ మాట్లాడుతూ ధర్మాన్ని ఆచరిస్తూ ధర్మాన్ని రక్షించినప్పుడే మనమందరము సురక్షితంగా ఉంటాము. మన దేశం బాగుంటుంది. దేశ సరిహద్దుల్లో జవానులు దేశాన్ని రక్షిస్తుంటే మనం ఈ ధర్మాన్ని రక్షించుకోవాలి. అప్పుడే దేశం సురక్షితంగా ఉంటుంది. తీర ప్రాంతాల్లో అన్యమతస్తులు మతమార్పిడికి ఎక్కువ ప్రయత్నాలు చేస్తున్నారు. వారిని అడ్డుకొని మన ధర్మాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని అన్నారు. ముమ్మిడివరం సంఘచాలక్ పి.కృష్ణమరాజు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడకం తగ్గించి భూమిని కాపాడుకోవాలి అన్నారు. సమరసత సేవా ఫౌండేషన్ ధర్మ ప్రచారక్ కనకారావు మాట్లాడుతూ కుటుంబ విలువలు కాపాడుకుంటూ మన పిల్లలకు సంస్కృతి సాంప్రదాయాలు అలవరుస్తూ చదువుతోపాటు భగవద్గీత రామాయణం మొదలగు గ్రంథాలను చదవడం వారికి అలవాటు చేయాలన్నారు. సమాజంలో సమరసత సేవా ఫౌండేషన్ ద్వారా గతంలో దేవాలయాలు నిర్మించి దేవాలయ కేంద్రముగా అనేక ధార్మిక కార్యక్రమాలు చేస్తూ అందరిని మమేకం చేయడం జరుగుతుందన్నారు. సంస్థ నిర్మించిన దేవాలయ కేంద్రముగా బాల వికాస్ కేంద్రాలను ప్రారంభించి పిల్లలకు చదువుతోపాటు సంస్కారాలు ఆచారాలు ఆధ్యాత్మిక విషయాలను వారికి అలవాటు చేయడం జరుగుతుందన్నారు. బాల వికాస్ విద్యార్థులు నిర్వహించిన నృత్య ప్రదర్శన అద్భుతంగా ఉందని ఆధ్యాత్మిక సేవకులు గ్రంధి నానాజీ అన్నారు. గ్రామ సర్పంచ్ ఓలేటి మంగాదేవి నాగేశ్వరరావు మాట్లాడుతూ మారుమూల తీర ప్రాంత గ్రామాలకు కూడా స్వామీజీని తీసుకొచ్చి హిందుత్వం గురించి చక్కగా తెలియజేసిన ఆర్ఎస్ఎస్ వారికి మరియు ఎస్ ఎస్ ఎఫ్ ధార్మిక సమితి సభ్యులకు ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అంగాని నరసింహా మూర్తి గ్రామ పెద్దలు అంగాన్ని కామేశ్వరరావు పాలెపు నాగేశ్వరరావు తాడి మహేష్ అర్ధాని సత్యం అంకాని శ్రీను సంగాని అన్నవరం కోలా మీరయ్య మల్లాడి మహాలక్ష్మి పాలెపు ధనలక్ష్మిపతిరావు పెసింగి వెంకట్రావు పాలెపు శ్రీరాములు, పాలెపు కృష్ణ సంగాని ధన కుమారి కాలాడి దేవి కర్రి సత్యవతి పాలెపు లక్ష్మీనారాయణ అంగాని రామలక్ష్మి నాగిడి మంగాదేవి ఏలూరి రాంబాబు మట్ట సూరిబాబు గుత్తుల భైరవమూర్తి మరియు అధిక సంఖ్యలో మాతృమూర్తులు పాల్గొన్నారు.