ఆగా ఖాన్ అకాడమీలో గిరిజన విద్యార్థికి సీటు

పయనించే సూర్యుడు జనవరి 05 ఉట్నూర్ మండలం ప్రతినిధి షైక్ సోహెల్ పాషా ఉట్నూర్, న్యూస్‌ టుడే: ఉట్నూర్ ఏకలవ్య మోడల్ గురుకుల పాఠశాల (ఈఎంఆర్ఎస్)కు చెందిన గిరిజన విద్యార్థి జాదవ్ అభిరామ్ అరుదైన ఘనత సాధించారు ప్రతిష్టాత్మక ఆగా ఖాన్ అకాడమీలో 6వ తరగతిలో ప్రవేశానికి ఎంపికయ్యారు అత్యంత కఠినమైన నాలుగు దశల ఎంపిక ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసి, ఇంటర్వ్యూలో తన ప్రతిభను చాటి అభిరామ్ ఈ సీటును దక్కించుకున్నారు ఈ సందర్భంగా ఐటీడీఏ పీఓ యువరాజ్ మర్మాట్ విద్యార్థిని ప్రత్యేకంగా అభినందించారు గిరిజన విద్యార్థులు విద్యలో మరింత ప్రతిభ కనబరిచి ఇలాంటి విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.