ఆటో డీ పోస్టల్ శాఖ ఉద్యోగి దుర్మరణం

పయనించే సూర్యుడు న్యూస్ మందమర్రి మండలం ప్రతినిధి బొద్దుల భూమయ్య జనవరి 5 మంచిర్యాల శివారు ఎసిసి కల్వర్టు ప్రాంతంలో రాత్రి 8:30 నిమిషాల సమయంలో ఆర్ ఆర్ నగర్ కాలనీకి చెందిన ఎసిసి నుండి ఆర్ ఆర్ నగర్ కాలనీకి నడుచుకుంటా వెళుతున్న సందర్భంలో రాంబట్ల నాగేందర్ శర్మ 56 ను వెనక నుండి ఆటో అతివేగంగా వచ్చి ఢీకొనడంతో క్షతగాత్రులు అయ్యారు వెంటనే 108 అంబులెన్స్ లో మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడి నుండి కరీంనగర్ కు తీసుకువెళ్లగా తెల్లవారుజామున 3 గంటలకు తుది శ్వాస విడిచారు అతనికి ఒక కుమారుడు కుమార్తె మరియు భార్య ఉన్నారు మృతుడు సిర్పూర్ టీ పోస్టల్ శాఖలోఉద్యోగం చేయుచున్నారు ఈ కార్యక్రమంలో ఆర్ ఆర్ నగర్ రోడ్ నెంబర్ వన్ మరియు టు కాలనీవాసులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనై వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు