
పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జీల్లా జగయ్యపేట నియోజకవర్గం జనవరి 5 జగ్గయ్యపేట పట్టణంలోని ఆటోనగర్ లో గల ఆమోద స్పిన్నింగ్ మిల్ ఆవరణలో ఆమోద ఇండస్ట్రీస్ అధినేత ఉప్పతళ్ల కొండలరావు ఆధ్వర్యంలో జరిగిన నూతన సంవత్సరం సందర్భంగా కృతజ్ఞత ఆరాధన కూడిక కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్-ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు ఈ కృతజ్ఞత ఆరాధన గొప్ప మహోత్సవ లో పాల్గొనటం ఆనందదాయకం ఉంది అని, నియోజకవర్గంలో మరిన్ని సేవలు చేయాలని, ఆ ప్రభు ఆశీస్సులు కొండలరావు పై ప్రజల పై మరింత ఉండాలని ఆయన అన్నారు. అనంతరం:- ప్రత్యేక ఆకర్షణ క్రిస్మస్ కంటాట ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన క్రీస్తు జనన ప్రదర్శన కనీవినీ ఎరుగని రీతిలో భారీ సెట్టింగ్ లతో 50 మంది వినూత్న కళాకారులచే నిర్వహించిన ప్రదక్షణను ప్రదర్శను దైవజనులు ప్రజలు నాయకులు కల్లారా వీక్షించారు. ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖురాలు జయసుధ , రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, దైవజనులు, ప్రముఖులు హాజరయ్యారు

