పయనించే సూర్యుడు న్యూస్: పెద్దపల్లి, సెంటినరీ కాలనీ -05 ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో ప్రభుత్వం రామగిరి మండలంలోని రత్నాపూర్ గ్రామ మేడిపల్లి శివారులో సుమారు 220 ఎకరాల భూమిని సేకరించడం, నిన్నటితో సంతకాల సేకరణ పూర్తిస్థాయిలో జరగడంతో అధికారులు రైతులకు ఇచ్చిన హామీలను విస్మరిస్తున్నారని మొదట ఏషాంగి పంటకు అనుమతి ఇచ్చి ఇప్పుడు తీరా రైతులు పొలాలు సాగు చేసిన తర్వాత ఈ భూముల్లో ఎలాంటి పంటలు వేయకూడదని వేసినచో నష్టపరిహారం చెల్లించబడదని అధికారులు నోటిఫికేషన్ విడుదల చేయడమేంటని కొండు లక్ష్మణ్ మండిపడ్డారు. రైతులకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీ నెరవేర్చకపోయినా ఈ భూముల్లో రసాయన కర్మ గారాలు తీసుకొచ్చిన మళ్లీ తప్పక ఉద్యమిస్తామన్నారు. ఒకపక్క సింగరేణి కాలుష్య కోరాలతో విషం చిమ్ముతుంటే ఇప్పుడు ఇంకో పక్క ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో రసాయన ఖర్మగారాలు తీసుకువచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే ఎంతటి పోరాటనికైనా సిద్ధమన్నారు. ఇప్పటివరకు ఈ భూముల్లో ఏ కంపెనీలు వస్తాయని అధికారులు వెల్లడించకపోవడంలో రహస్యమేంటని కేవలం డబ్బులు దన్నుకునేందుకే ఈ భూ సేకరణ చేస్తున్నారా అని అయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వెంటనే రైతులకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చాలని ఆయన అధికారులను కోరారు.