ఇర్రిపాక శివకేశవ ఆలయంలో నెల రోజులపాటు ధనుర్మాస పూజలు

★ పాల్గొన్న జగ్గంపేట ఎమ్మెల్యే, టిటిడి బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ

పయనించే సూర్యుడు జనవరి : 5 జగ్గంపేట నియోజకవర్గ ఇంచార్జి కె సాయి దుర్గ కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట మండలం ఇర్రిపాక ఏలేరు నది తీరాన వేంచేసి ఉన్న శివ కేశవుల ధనుర్మాసం సందర్భంగా డిసెంబర్ 16వ తేదీ నుండి జనవరి 13 భోగి పండగ వేద పండితులు కామేశ్వర శర్మ, నాగేశ్వర శర్మ, దత్తు శర్మ ఆధ్వర్యంలో శ్రీవారికి ధనుర్మాస పూజలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా, యాగశాలలో శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వరస్వామి వారికి పూజలు, నారాయణ యాగం, గ్రామోత్సవం తదితర సేవలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఆదివారం జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ధనుర్మాస పూజల్లో పాల్గొన్నారు. వేద పండితులు, ఆగమ శాస్త్ర నిపుణులు, పూజారులు శ్రీవారికి పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ధనుర్మాసం అంటే శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసం. సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించినప్పుడు ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ ఏడాది ధనుర్మాసం డిసెంబర్ 16, 2025 నుంచి జనవరి 14, 2026 వరకు ఉంటుంది అని ఈ నెల రోజులు ఇర్రిపాక శివ కేశవుల క్షేత్రంలో ప్రత్యేక పూజలు నారాయణ యాగం నిర్వహిస్తున్నామని అన్నారు. ధనుర్మాసం ఎంతో విశిష్టత కలిగిందని ఈ మాసంలో శ్రీమహావిష్ణువును మధుసూదనుడు పేరుతో పూజిస్తారు.ధనుర్మాసంలో తిరుప్పావై పారాయణం, గోదా కళ్యాణం, తులసి పూజలు చేస్తారు. ఈ మాసంలో విష్ణు ఆలయాల్లో విశేష పూజలు జరుగుతాయి ధనుర్మాసంలో చేసే పూజలు, వ్రతాలు సకల శుభాలను కలుగజేస్తాయని భక్తుల నమ్మకం. అని జ్యోతుల నెహ్రూ అన్నారు. ఆయన వెంట జ్యోతుల వీరభద్రరావు, మండపాక అప్పన్న దొర, అడపా నానాజీ, సుర్ల అప్పారావు, రఘురామరాజు, పెద్దరాజు తదితరులు పాల్గొన్నారు.