ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారులు

పయనించే సూర్యుడు జనవరి : 5 జగ్గంపేట నియోజకవర్గ ఇంచార్జి కె సాయి దుర్గ నూతన సంవత్సరం సందర్భంగా జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూను జగ్గంపేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వై.ఆర్.కే. శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జగ్గంపేట, గండేపల్లి, కిర్లంపూడి సబ్‌ ఇన్‌స్పెక్టర్లు రఘునాథరావు, శివ నాగబాబు, సతీష్లు కూడా శాసనసభ్యుల నివాసానికి చేరుకుని నూతన సంవత్సర బిలేటెడ్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజల భద్రతకు తీసుకుంటున్న చర్యలు, పోలీస్ శాఖ సమన్వయంతో చేపడుతున్న కార్యక్రమాలపై శాసనసభ్యులతో స్నేహపూర్వకంగా చర్చించారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల అమలులో పోలీస్ శాఖ కీలక పాత్ర పోషిస్తున్నదని శాసనసభ్యులు పేర్కొంటూ, పోలీస్ అధికారుల సేవలను అభినందించారు.