గురుకుల ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

పయనించే సూర్యుడు జనవరి 5 (ప్రతినిధి గుమ్మకొండ సుధాకర్ డిండి మండలం నల్లగొండ జిల్లా) సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఐదు నుంచి తొమ్మిదవ తరగతి వరకు ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డిండి గురుకుల ప్రిన్సిపాల్ వై శిరీష తెలిపారు. జనవరి 21 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని పేర్కొన్నారు. అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.