పయనించే సూర్యుడు జనవరి 05, (చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు) చింతకాని మండలం బొప్పారం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని లక్ష్యంతో గ్రామ కమిటీ ఎన్నికలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా నూతన గ్రామ సర్పంచ్ షేక్ రహమతుల్లా, ఎస్సీ కాలనీ యువత ఆధ్వర్యంలో కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల్లో గ్రామ అధ్యక్షుడిగా చిలీకేసి వెంకటేశ్వర్లు, గ్రామ ఉపాధ్యక్షుడిగా గురుజాల శ్రీధర్, అధికార ప్రతినిధిగా దర్శ నవీన్, కార్యదర్శిగా నల్లమాసు రంగారావు, ప్రచార కార్యదర్శిగా షేక్ మీరా సాహెబ్, ప్రధాన కార్యదర్శిగా షేక్ హవిద్, కార్యవర్గ సభ్యుడిగా చిర్ర రామకృష్ణ లను నియమించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, యువకులు, మహిళలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని ఘనంగా విజయవంతం చేశారు. గ్రామ అభివృద్ధి, గ్రామ సమస్యల పరిష్కారానికి కట్టుబడి పని చేస్తామని నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు ఈ సందర్భంగా తెలిపారు.