ఘనంగా సావిత్రి భాయి పూలే జయంతి వేడుకలు

* బీసీ సంక్షేమ సంఘం పట్టణ యూత్ అధ్యక్షులు ముదారపు శేఖర్ ఆధ్వర్యంలో

పయనించే సూర్యుడు న్యూస్ మందమరి మండల రిపోర్టర్ జనవరి 5 ( బొద్దుల భూమయ్య ) మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మందమర్రి పట్టణంలో సావిత్రిబాయి ఫూలే చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది అనంతరం యూత్ అధ్యక్షులు ముడారపు శేఖర్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కొండిళ్ల శ్రీనివాస్ లు మాట్లాడుతూ స్త్రీ అభ్యుదయవాది, సంఘసంస్కర్త, సత్య శోధక మండలి సహ వ్యవస్థాపకురాలు, స్త్రీ విద్య, హక్కులకు కృషి చేసిన వీర వనిత, సామాజిక రుగ్మతలపై పోరాడి, అణగారిన వర్గాలకు అండగా నిలబడిన శ్రీమతి సావిత్రిబాయి పూలే సేవలను స్మరిస్తూ మహిళల పట్ల వివక్ష నెలకొడిన ఆరోజుల్లోనే మహిళల హక్కుల కోసం కృషి చేస్తూ, ఈ దేశంలోనే మొట్ట మొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా బాధ్యతలు చేపట్టిన వారి స్ఫూర్తితోనే ఈరోజు మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని,పూలే దంపతుల ఆశయాలను కొనసాగిస్తూ బీసీల హక్కుల కోసం పోరాడుతామని, బీసీలకు విద్య, ఉద్యగ, ఉపాధి రంగాల్లో రిజర్వేషన్లు సాధించినప్పుడే వారి కల సాకారం అవుతుందని,ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీల హక్కుల కోసం అట్రాసిటీ చట్టాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తూ ఉన్నదో అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా బీసీల హక్కుల కోసం వెనుకబడిన బీసీ వర్గాలకు రక్షణ కల్పిస్తూ తెలంగాణ రాష్ట్రంలో కూడా బీసీలకు అట్రాసిటీ చట్టాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞాపన చేస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా యూత్ ఉపాధ్యక్షులు రాయబారపు కిరణ్, తడిగొప్పుల రవిరాజా, మడ్డి వేణుగోపాల్ గౌడ్, ఎండి కలీం, నల్లగొండ రమేష్, సత్యనారాయణ, చింతల రమేష్, నాగరాజు, అయాన్, వంశీ మరియు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *