పయనించే సూర్యుడు జనవరి 5 ఎన్ రజినీకాంత్:- హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ శ్రీ వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలలో జరిగే జాతర పనులను ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ఆదివారం పరిశీలించారు జాతర సందర్భంగా చేపడుతున్న పనుల పురోగతిని ఆలయ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు పనులు వేగవంతం చేసి, భక్తులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.. ఈ కార్యక్రమంలో ముల్కనూర్, వంగర, ఎల్కతుర్తి ఎస్సైలు రాజు, దివ్య, ప్రవీణ్ కుమార్, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు..