నేడుసింగూర్ ప్రాజెక్టులో చేప పిల్లలు వదులుట

★ తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశాలు మల్లన్నగారిదుర్గురెడ్డి

పయనించేసూర్యుడు. న్యూస్ 5 జనవరి 2026 పుల్కల్ మండల ప్రతినిధి పెద్దగొల్ల విజయ్ కుమార్. సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గం పుల్కల్ మండల పరిదిలోని సింగూర్ ప్రాజేక్ట్ లో సోమవారం ఉదయం 10:30 గంటలకు తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖమంత్రి దామోధర రాజనర్సింహ్మ అదేశనుసారం సంగారెడ్డి జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో సింగూర్ ప్రాజెక్టులో చేపలు వదులుట జరుగును కావున ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. సర్పంచులు, ఉప సర్పంచ్ లు. వార్డు మెంబర్లు, మాజీ సర్పంచ్ లు.మాజి ఎంపీటీసీలు, ఆత్మ కమిటీ డైరెక్టర్లు, వివిధ కుల సంఘల నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, సిడిఆర్ అభిమానులు, యన్.యస్.యు.ఐ. నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున సకాలంలో పాల్గొనాలని పుల్కల్ మండల కాంగ్రేస్ పార్ఠీ అధ్యక్షులు మల్లన్న దుర్గురెడ్డి అన్నారు.