
పయనించే సూర్యుడు జనవరి 5 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) ఈ భూమి నాది అనే ధైర్యంతో ప్రతి రైతు హాయిగా నిద్రపోవాలి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి జగన్ బొమ్మ ఉన్న పట్టాదారు పాస్ పుస్తకాలు ఇంట్లో ఉంటే అరిష్టం. తిరిగి ఇచ్చేయాలని రైతులకు పిలుపు ప్రభుత్వ రాజముద్రతో, భద్రతా ప్రమాణాలు పాటిస్తూ నూతన పట్టాదారు పాసుపుస్తకాలు అందిస్తున్నాం గత ప్రభుత్వం ఇచ్చిన పాస్ పుస్తకాలు.తమ ప్రభుత్వం ఇస్తున్న పాస్ పుస్తకాలకు ఉన్న తేడాను రైతులకు అర్థమయ్యేలా వివరించిన మంత్రి ఆనం ఇప్పుడు ఇస్తున్న పాస్ పుస్తకాలను అధికారులు ఇష్టప్రకారం మార్చడానికి కుదరదు. ఏం మార్పులు చేయాలన్నా డేటా సెంటర్ నుంచే మార్పులు చేయాల్సి ఉంటుంది ప్రభుత్వ రాజముద్రతో జారీ చేసిన పట్టాదారు పాస్ పుస్తకాల్లో వున్న క్యూర్ కోడ్ స్కాన్ చేస్తే భూ యజమానికి సంబంధించిన అన్ని వివరాలు అప్పటికప్పుడే కనిపిస్తాయి మీ భూమి – మీ హక్కు నినాదంతో పెరుమాళ్ళపాడు గ్రామంలో పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమం లో పాల్గొన్న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రభుత్వ రాజముద్రతో జారీ చేసిన పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు అందజేసిన మంత్రి ఆనం రైతుల భూ హక్కులకు చట్టబద్ధ భద్రత కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి డిజిటల్ భూ రికార్డులతో పారదర్శకత పెరిగిందని, వివాదాలకు చెక్ పడుతుందని వ్యాఖ్య పట్టాదారు పాస్ పుస్తకాల్లో ఏ చిన్న తప్పు జరిగినా తక్షణమే సరిచేస్తాం . మంత్రి ఆనం గత ప్రభుత్వం కోటి మంది రైతుల భూములకు వారి భూమిపై వారికి హక్కు లేకుండా ఎందుకు పనికిరాని పట్టాదారు పాస్ పుస్తకాలను ముద్రించి పంపిణీ చేసేందుకు ప్రయత్నం చేసింది ఎన్నికలకు మూడు నెలల ముందే ఈ దుర్మార్గపు ఆలోచన చేసి 35 లక్షల రైతుల పాస్ పుస్తకాలను మార్చేశారు గత ప్రభుత్వం పంపిణీ చేసిన దొంగ నోటు లాంటి పాస్ పుస్తకాల స్థానంలో ప్రభుత్వ రాజముద్ర తో ముద్రించిన పాస్ పుస్తకాలను ప్రతి ఇంటికి పంపిణీ చేస్తున్నాం నెల్లూరు జిల్లాలో 235 గ్రామాల్లో 1.05 లక్షల మందికి పైగా రైతులకు జగన్ బొమ్మతో కూడిన పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు ఆత్మకూరు నియోజకవర్గం లోని ఐదు మండలాల్లో 13 గ్రామాల్లో 5486 ఈ పట్టాలను పంపిణీ చేశారు.. వీటి స్థానంలో నేడు ప్రభుత్వ రాజముద్ర, క్యూఆర్ కోడ్ తో కూడిన భద్రతా ప్రమాణాలు పాటిస్తూ పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీకి శ్రీకారం చుట్టాం రీసర్వే పేరుతో చేపట్టిన భూముల సర్వేలో కూడా హద్దురాళ్లపై జగన్ బొమ్మలు ముద్రించి 650 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు మంత్రి ఆనం 2026 డిసెంబర్ నాటికి రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థ లోని లోపాలను పూర్తిగా ప్రక్షాళన చేసి ప్రజలకు,రైతన్నలకు అండగా నిలుస్తాం. మంత్రి ఆనం ఎవరూ ఊహించని విధంగా సూపర్ సిక్స్ ను విజయవంతంగా అమలు చేశాం మంత్రి ఆనం త్వరలోనే మూడో విడత అన్నదాత సుఖీభవ నిధులు జమ చేస్తాం మంత్రి ఆనం విద్యుత్ ట్రూఅప్ చార్జీలను పూర్తిగా రద్దు చేశాం : మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గత ప్రభుత్వం ఐదేళ్లలో రూ.32,166 కోట్ల ట్రూప్అప్ చార్జీలను వసూలు చేసింది ఇక నుంచి ట్రూఅప్ చార్జీల భారం ప్రజలపై వేయకుండా తమ ప్రభుత్వమే భరిస్తుంది రాష్ట్రవ్యాప్తంగా ఏడాదికి రూ.4497 కోట్ల ట్రూఅప్ చార్జీలను ప్రభుత్వమే భరిస్తుంది తిరుపతి రీజియన్ పరిధిలో 1551.69 కోట్ల మేర ప్రజలకు లబ్ధి విద్యుత్చార్జీలను కూడా తగ్గించే ఆలోచన చేస్తున్నాం. ఆత్మకూరు నియోజకవర్గంలోని సంగం మండలం అన్నారెడ్డిపాలెం, చేజర్ల మండలం పెరుమళ్లపాడుకు నూతన సబ్ స్టేషన్లు మంజూరయ్యాయి మంత్రి ఆనం.పెరుమాళ్లపాడులోని పురాతన శివాలయం పునర్నిర్మానికి రూ. 1.50 కోట్లు నిధులు మంజూరు చేశాం. మంచి శుభ ముహూర్తం చూసి పనులు ప్రారంభిస్తాం మంత్రి ప్రజలకు సుపరిపాలన అందిస్తూ రామరాజ్య స్థాపనే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తుంది . మంత్రి ఆనం ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు షేక్ సిరాజురుద్దీన్. గ్రామ సర్పంచి తలపనేని జయంతి నాయుడు. మండల నాయకులు కార్యకర్తలు అభిమానులు రెవిన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు