పాతర్లపాడు గ్రామ అభివృద్ధికి నూతన సర్పంచ్ లక్ష్మీ అచ్చయ్య స్ఫూర్తిదాయక చర్యలు

పయనించే సూర్యుడు జనవరి 05 (చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు). చింతకాని మండల పరిధిలో ని పాతర్లపాడు గ్రామ అభివృద్ధిని ఉరుకుల పరుగులు పెట్టిస్తున్న నూతన సర్పంచ్, సిపిఎం పార్టీకి చెందిన లక్ష్మీ అచ్చయ్య గ్రామాన్ని ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దాలని సంకల్పంతో కీలక చర్యలు చేపడుతున్నారు. గ్రామంలోని అన్ని వార్డులకు సమానంగా మౌలిక వసతులు అందించాలని ఉద్దేశంతో విద్యుత్ దీపాల ఏర్పాటు కార్యక్రమాన్ని తక్షణమే ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామంలోని ప్రతి వీధి వెలుగులతో కళకళలాడేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ దారేల్లి సురేష్, వార్డు మెంబర్లు, విద్యుత్ దీపాలు అమర్చుతున్న ఎలక్ట్రిషన్ సిబ్బంది, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ లక్ష్మి అచ్చయ్య మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కోసం గ్రామ ప్రజలంతా సహకరించాలని కోరారు. గ్రామ అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని ఆమె తెలిపారు.