పయనించే సూర్యడు జనవరి 05 సూర్యాపేట జిల్లా నడిగూడెం ప్రతినిధి పొలంపల్లి వెంకటేశ్వర్లు ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయం చేయాలని సిరిపురం కు చెందిన ఆదర్శ రైతు వాసికర్ల శేషు కుమార్ కోరారు. ఆదివారం మండల పరిధిలోని వల్లాపురంలో సిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయం పై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గత 60 ఏళ్లుగా మనం చేస్తున్న రసాయనిక సాగుతో నేల పూర్తిగా దెబ్బతిన్నదని, దీంతో భూసారం తగ్గిందన్నారు. భూసారం పెరగాలంటే తొలకరిలో పచ్చి రొట్ట పంటలు సాగు చేయాలని, పంట సమయంలో జీవామృతం, ఘన జీవామృతం నేలకి వాడాలన్నారు. అలాగే పంటల్లో ఆశించే చీడ, పీడల నివారణకు వేప గింజల కాషాయం, నీమాస్త్రం, తూటికాడ, వాయిలాకు, దశపత్రి, ఆవు మూత్రం ఆవు పేడ ద్రావణం, పుల్లటి మజ్జిగ ద్రావణాలు పిచికారీ చేసి నివారంచవచ్చన్నారు. అనంతరం ఆ గ్రామ సర్పంచ్ కేశగాని సరిత మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయం చేయాలన్నారు. మనతో పాటు మన భవిష్యత్ తరాలు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రైతు కుడా తమ కుటుంబ అవసరాల కోసం ప్రకృతి వ్యవసాయం చేయాల్సిందేనన్నారు. మన ఊరు రైతులందరు ప్రకృతి వ్యవసాయం చేపట్టి అందరికి ఆదర్శంగా ఉందామన్నారు. ఈ కార్యక్రమంలో ఆ గ్రామ ఉపసర్పంచ్ కోట శేఖర్‌రెడ్డి, సిరి ఫౌండేషన్ వ్యవస్థాపకులు కిసాన్ సేవా రత్న డాక్టర్ మొలుగూరి గోపయ్య (గోపి ), రైతులు పల్లా యుగేందర్ రెడ్డి, బజ్జురీ అచ్చిరెడ్డి, బజ్జురి వీరారెడ్డి, కేశగాని లక్ష్మణ్, వట్టికూటి శ్రీను, నిండుచర్ల వెంకటేశ్వర్లు, బజ్జురి వెంకటరెడ్డి, కాకి రాజు, లింగారెడ్డి, గురుస్వామి పాల్గొన్నారు.