
పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జీల్లా జగయ్యపేట నియోజకవర్గం జనవరి 5 పెనుగంచిప్రోలు మండలం, సుబ్బాయిగూడెం గ్రామంలో రీ సర్వే చేయబడి ప్రభుత్వం నూతనంగా జారీచేసిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను గ్రామ సచివాలయం వద్ద రెవెన్యూ అధికారులతో కలిసి రైతులకు అందజేసిన శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ తాతయ్య ఈ సందర్భంగా శాసనసభ్యులు శ్రీరాం తాతయ్య మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ప్రజా సంక్షేమమే ముఖ్య లక్ష్యంగా పాలన సాగిస్తుందన్నారు.. గత ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ఫోటోలతో జారీ చేసిన పాసు పుస్తకాల్లో తప్పిదాల వలన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు.. అన్ని ఇబ్బందులను అధిగమించి జగన్ బొమ్మ స్థానంలో ప్రభుత్వ రాజముద్ర, క్యూఆర్ కోడ్ తో కూడిన పాస్ బుక్ లను రైతులకు నేడు అందజేస్తున్నామన్నారు. నేటి నుంచి ఈనెల 9 వరకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో పెనుగంచిప్రోలు మండలం తాసిల్దార్ శాంతిలక్ష్మీ ,పెనుగంచిప్రోలు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చింతల సీతారామయ్య, ఎంపీటీసీ వెల్ది ప్రభాకర్, గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వెల్ది శ్రీనివాసరావు, జిల్లేపల్లి సుధీర్ బాబు,వెల్ది అశోక్, అప్పారావు, వడ్లమూడి వెంకటేశ్వరరావు, మాదినేని వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.