మరోసారి తన మంచి మనసును ప్రదర్శించిన మండల పార్టీ అధ్యక్షులు చింతల సీతారామయ్య

పయనించే సూర్యుడు జనవరి 5 ప్రమాదవశాత్తు బైక్ మీద నుంచి కింద పడ్డ వ్యక్తిని దగ్గర ఉండి ఆసుపత్రిలో జాయిన్ చేసిన పెనుగంచిప్రోలు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చింతల సీతారామయ్య మంచికి మారుపేరని అందరూ అంటుంటే విన్నాం కానీ కనులారా చూసామంటూ ఈ సంఘటన చూసిన ప్రతి ఒక్కరు జయహో చింతల సీత రామయ్య అంటూ పొగడ లేకుండా ఉండలేకపోతున్నారు. అసలు విషయంలోకి వెళ్తే పెనుగంచిప్రోలు గ్రామంలో శ్రీ తిరుపతమ్మ అమ్మవారిని దర్శించుకోవడానికి అనేక ప్రాంతాల నుంచి భక్తులు వస్తూ ఉంటారు ఈ క్రమంలో ఖమ్మంపాడు గ్రామానికి చెందిన ఒక భక్తుడు అదుపుతప్పి బ్రిడ్జి మీద బైక్ పైన కింద పడగా, అటుగా వెళ్తున్న మండల పార్టీ అధ్యక్షులు చింతల సీతారామయ్యగారి దానిని గమనించి దగ్గరుండి హాస్పటల్ వారికి తనే స్వయంగా అంబులెన్స్ కు ఫోన్ చేసి దగ్గరుండి అంబులెన్స్ ఎక్కించి డాక్టర్ తో తన ఆరోగ్య కుదుటపడేలా జాగ్రత్త చూసుకోవాలని తెలిపారు. అదేవిధంగా పోలీసు వారికి వారి కుటుంబ సభ్యులకు తెలియపరిచి తన ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని పోలీసువారికి సూచించడం జరిగింది.