మాజీ మంత్రివర్యులు డా. మెట్ల సత్యనారాయణ మార్గం అనుసరణీయం

పయనించే సూర్యుడు జనవరి 5 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కోనసీమ అభివృద్ధికి అనుక్షణం కృషి చేసిన నాయకులు డా.మెట్ల, బాలయోగి ఆయన మార్గంలో నడవడం మన బాధ్యత ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు మాజీ మంత్రివర్యులు డా. మెట్ల సత్యనారాయణ మార్గం నేటితరానికి అనుసరణీయం అని ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు అన్నారు. ఆదివారం మెట్ల సత్యనారాయణ జయంతి సందర్భంగా అమలాపురంలో నల్ల వంతెన వద్ద ఉన్న మెట్ల సత్యనారాయణ విగ్రహానికి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అమలాపురం ఎంపీ హరీష్ మాధుర్, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందం, అమలాపురం శాసన సభ్యులు అయితాబత్తుల ఆనందరావు,ఛైర్మన్ సోంబాబు, డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా టిడిపి అధ్యక్షులు గుత్తుల సాయి ,మెట్ల రమణ బాబులతో కల్సి మెట్ల సత్యనారాయణ ఘాట్ వద్ద డా.మెట్ల 84వ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే బండారు నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు అజాత శత్రువు, వివాదరహితులు,కోనసీమ అభివృద్ధికి నిరంతరం కృషి చేసిన నాయకులు డా. మెట్ల సత్యనారాయణ అని ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు అన్నారు. కోనసీమ ప్రత్యేక జిల్లాగా ఏర్పడాలని, కోనసీమ అభివృద్ధి మండలి పేరుతో అధికారంలో ఉన్నప్పుడు, లేనప్పుడు కూడా నిరంతరాయంగా కృషి చేసిన నాయకుడు డా. మెట్ల సత్యనారాయణ అని ఆయన అన్నారు. ఆయనకు జీ ఎం సీ బాలయోగి, తాము సహకారం అందించామన్నారు. కోనసీమ అంతా ఒక నియోజకవర్గంగా భావించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరచడానికి పామర్రు – కత్తిపూడి రహదారి, యానాం ఎదుర్లంక వారధి, జాతీయ రహదారిపై రెండు వారధులు, బోడసకుర్రు వారధి కానీ, రైల్వే లైను తీసుకురావడం, అమలాపురంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కానీ అమలాపురం నైసర్గిక స్వరూపం ఈ రూపంలో ఉందనడానికి ఆ మహనీయుల కృషేనని ఆయన అన్నారు. ఒక కుటుంబంలా అందరితో కలసి తనకు ఒక అన్నగా ఉండేవారని, వైద్యారోగ్య శాఖా మంత్రిగా, సహకార శాఖా మంత్రిగా ప్రతీ నియోజవర్గాల అభివృద్ధికి కృషి చేశారన్నారు. ఆయన జయంతి సందర్భంగా నివాళులు అర్పించడం అదృష్టమన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *