ప్రయ నించే సూర్యుడు జనవరి 5 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ స్వర్గీయ డా ॥ మెట్ల సత్యనారాయణరావు 84వ జయంతి సందర్భంగా నల్లవంతెన వద్ద ఉన్న డాక్టర్ మెట్ల సత్యనారాయణ రావు విగ్రహానికి నివాళులర్పించి అనంతరం కిమ్స్ ఎదురుగా గల డాక్టర్ మెట్ల ఘాట్ నందు నివాళులు అర్పించిన ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు . ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డా.మెట్ల ఆశయ సాధనకు కృషి చేస్తామన్నారు. మెట్ల కుమారుడు రమణబాబు ఆధ్వర్యంలో జరిగిన జయంతి వేడుకల్లో పలువురు నేతలు పాల్గొన్నారు. మెట్ల పార్క్ లో వున్న విగ్రహానికి, మార్కెట్ లో వున్న విగ్రహానికి, లారీ యూనియన్ ఆఫీస్ వద్ద, చిన్న కారు స్టాండ్ వద్ద వున్న మెట్ల విగ్రహలు కు నేతలు నేతలు పూలమాలలు వేసి నివాళులు లు అర్పించారు. ఈ కార్యక్రమం లో ఎంపీ హరీష్ మాధుర్ , కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు , ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల బుచ్చిరాజు, , అముడా చైర్మన్ అల్లాడ స్వామి నాయుడు, డీసీఎంఎస్ చైర్మన్ పెచ్చెట్టి చంద్రమౌళి, ఆకుల రామకృష్ణ నామన రాంబాబు, చిక్కాల గణేష్, మోకా సుబ్బారావు, కల్వకొలను తాతాజీ, బొర్రా చిట్టిబాబు, ఆశెట్టి ఆదిబాబు, ఏడిద శ్రీను మెట్ల అభిమానులు కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి, దివంగత డాక్టర్ మెట్ల సత్యనారాయణరావు 84వ జయంతి సందర్భంగా అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ అల్లాడ స్వామినాయుడు (సొంబాబు) ఆధ్వర్యంలో పేదలకు వస్త్రదానం చేశారు.
