సంక్లిష్ట ప్రసవంలో ఆవుకు ప్రాణ రక్షకుడైనా హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ డాక్టర్ రాజకుమార్

పయనించే సూర్యడు న్యూస్ టెక్కలి ప్రతినిది జనవరి 05 నందిగాం మండలం మధనాపురం గ్రామానికి చెందిన రైతు నమ్మి మనిక్యమ్మ తాలూకా ఆవు చూలుతో ఉండగా తీవ్రమైన సమస్య తలెత్తింది. 360 డిగ్రీల గర్భాశయం మలబడి, గర్భద్వారం సరిగా విప్పకుండా ఉండడంతో ఆవు తీవ్రమైన నొప్పితో కుంగిపోగా, గర్భంలోని దూడ మృతి చెందగా ఈ అత్యవసర పరిస్థితిని గమనించిన పశువైద్యుడు డా. గురువెల్లి రాజ్ కుమార్ వెంటనే సిజేరియన్ శస్త్రచికిత్స (సి–సెక్షన్) చేయడం ద్వారా గర్భాశయాన్ని సరిచేసి, ఆవు ప్రాణాన్ని కాపాడారు. శస్త్రచికిత్స అనంతరం ఆవు వెంటనే లేచి నిలబడటం విశేషం. రైతు కుటుంబం మరియు గ్రామస్థులు డా. రాజ్ కుమార్ సేవా భావాన్ని, నిపుణతను ప్రశంసించారు. తక్షణం స్పందించి జంతువుకు నూతన జీవం ప్రసాదించిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.