సర్పంచ్ కోడూరి ఉమాదేవిని సన్మానించిన ఎస్సీ సెల్ నాయకులు

పయనించే సూర్యుడు న్యూస్ : జనవరి 5, తల్లాడ రిపోర్టర్ ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తల్లాడ మండలంలోని గొల్లగూడెం గ్రామ సర్పంచిగా గెలుపొందిన కోడూరి ఉమాదేవి వీరకృష్ణ ను నూతన సంవత్సరం సందర్భంగా ఎస్సీ సెల్ నాయకులు సాదా మల్లయ్య తిరుపతమ్మ వారిని ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి మంచి పనులు అందించాలని వారిని కోరారు. ఈ కార్యక్రమంలో ఇస్నేపల్లి వీరయ్య, అంబేద్కర్ యూత్ అధ్యక్షులు ఇస్నేపల్లి లక్ష్మణ్, తోటపల్లి కృష్ణ, విలసాగరం శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు, వెంకట్రావు, గుండ్ల బాలకృష్ణ, ఇస్నేపల్లి శ్రీను, గొల్లమందల ఏసోబు, తెల్లపూట్ట డేవిడ్,రావూరి రామకృష్ణ,రంగా తదితరులు పాల్గొన్నారు.