సర్పంచ్ గొడ్ల ప్రభాకర్ అధ్యక్షతన

★ నేడు అన్నారుగూడెంలో గ్రామసభ ★ కార్యక్రమంలో పాల్గొన్న తల్లాడ మాజీ ఎంపీపీ,అధికారులు

పయనించే సూర్యుడు న్యూస్ : జనవరి 5, తల్లాడ రిపోర్టర్ తల్లాడ మండలం అన్నారు గూడెం గ్రామంలో ఆ గ్రామ సర్పంచ్ గొడ్ల ప్రభాకర్ అధ్యక్షతన శనివారం గ్రామ పంచాయతీ సమావేశ మందిరంలో పాలకమండలి సమక్షంలో గ్రామసభ నిర్వహించారు. ఈ గ్రామసభలో తొలుత గ్రామ పాలకమండలి మరియు అధికారుల పరిచయ కార్యక్రమం జరిగింది. అనంతరం గ్రామాభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, పారిశుద్ధ్యం, విద్యుత్, మంచినీటి సౌకర్యం తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు గ్రామ శ్రేయస్సుకై పైన చర్చించిన విషయాలపై అంకిత భావంతో పనిచేయాలని, దీనికి పాలకమండలి సభ్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆయా వార్డుల్లో వారి ప్రాతినిధ్య వార్డుల్లో ప్రతి విషయంపై అవగాహన కలిగి ఆయా వార్డుల సమగ్రాభివృద్ధికై పాటుపడాలని ఈ సందర్భంగా ఆయన ప్రతి ఒక్కరిని సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తల్లాడ మాజీ ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు, ఉప సర్పంచ్ కొమ్మినేని వెంకటేశ్వరరావు, ఎంఈఓ దామోదర్ ప్రసాద్, వార్డు సభ్యులు, పంచాయితీ సెక్రటరీ వెంకటేశ్వరరావు, పంచాయతీ సహా సిబ్బంది, అంగనవాడి కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.