సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడిగా కేతిరి లక్ష్మారెడ్డి

★ ఏకగ్రీవంగా ఎన్నుకున్న సర్పంచులు

పయనించే సూర్యుడు జనవరి 5 ఎన్ రజినీకాంత్:- భీమదేవరపల్లి మండలం గాంధీనగర్ గ్రామానికి చెందిన ఏకగ్రీవ సర్పంచ్ కేతిరి లక్ష్మారెడ్డిని సర్పంచ్ ల ఫోరం మండల శాఖ అధ్యక్షునిగా ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. భీమదేవరపల్లి మండలం ముస్తఫాపూర్ బి ఆర్ కే ఫంక్షన్ హాల్ లో భీమదేవరపల్లి నూతన సర్పంచుల సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచుల ఫోరం అధ్యక్షునిగా కాంగ్రెస్ సీనీయల్ నాయకులు కేతిరి లక్ష్మారెడ్డిని, గొల్లపల్లి సర్పంచ్ నేతుల చంద్ర మోహన్ ప్రతిపాదించగా మాణిక్యాపూర్ సర్పంచ్ ముద్దసాని మమత సదానందం బలపరచగా, సమావేశానికి హాజరైన సర్పంచ్ లు చప్పట్లతో ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఉపాధ్యక్షులుగా గద్ద కుమారస్వామి యాదవ్ బోయినీ మహేష్ గజ్జల సృజన రమేష్, గుగులోతు పూర్ణిమ రాజు నాయక్, ప్రధాన కార్యదర్శిగా శిక ప్రదీప్ సంయుక్త కార్యదర్శిగా నేతల మోహన్ కార్యదర్శులుగా బొల్లంపల్లి అజయ్ కుమార్ కొర్ర గోపాల్ , వంగ తిరుమల సురేష్ గౌడ్, మండల రజిత మహేష్ కోశాధికారిగా డప్పు శ్రీనివాస్ ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా గడ్డం సుజాత రఘుపతి రెడ్డి, వూరడి భారతి జైపాల్ రెడ్డి, గూడేల్లి కల్పన తిరుపతిరెడ్డి, భూక్య సునీత మణికంఠ, ముద్దసాని మమత సదానందం సిద్దమల్ల రమా, రమేష్ , మేకల వెంకన్న బొల్లి మానస, ప్రశాంత్ గౌడ్, గోపగాని తిరుపతి గౌడ్ ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు చిట్టెంపెల్లి ఐలయ్య, మాజీ ఎంపీపీ బొజ్జపురి అశోక్ ముఖర్జీ, మాజీ నాయకులు కొలుగురి రాజు, మంగ రామచంద్రం, ఆదరి రవీందర్, ఊస కోయిల ప్రకాష్, డబ్బా శంకర్, పిడిశెట్టి కనకయ్య, మాడుగుల గోపి, కంకల సమ్మయ్య, మాడుల చింటూ ఉన్నారు. ఈ సందర్భంగా సర్పంచుల ఫోరం అధ్యక్షుడు లక్ష్మారెడ్డి మాట్లాడుతూ సహకారంతో భీంరెడ్డిపల్లి మండలంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి పరుచుకునే విధంగా సమిష్టి కృషితో ముందుకెళ్దాం అని తెలిపారు. తనపై నమ్మకం ఉంచి తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు సర్పంచ్ లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి తో పాటు నూతన కార్యవర్గాన్ని పలువురు శాలువాలతో సన్మానించారు..