4 వార్డ్ మెంబర్ జంగిలి సునీత ఆనంద్

పయనించే సూర్యుడు, జనవరి 5 2026, నాగర్ కర్నూల్ జిల్లా, కల్వకుర్తి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండల కేంద్రంలోని 4 వార్డులో ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని శుభ్రత పరిశుభ్రత అనే నినాదంతో శుభ్రతకు శ్రీకారం చుట్టారు. ఆదివారం 4వ వార్డ్ సభ్యురాలు జంగిలి సునీత ఆనంద్ నాలుగో వార్డ్ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈదమ్మ, వీరనాగమ్మ దేవాలయముల పరిసర ప్రాంతంలో జెసిబి సహాయంతో పిచ్చి మొక్కలు ఉన్న ప్రాంతాన్ని శుభ్రం చేయడం జరిగింది. రోడ్డుకు ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలను శుభ్రం చేస్తూ, గుంతలు గుంతలుగా ఉన్న రోడ్డును గుంతలు లేకుండా జెసిబి సహాయంతో గుంతలు పూడ్చడం జరిగింది. అదేవిధంగా 4 వార్డు ప్రజలు నా మీద నమ్మకంతో నన్ను గెలిపించేందుకు వారికి కృతజ్ఞతా భావంగా ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రజా సంక్షేమము కొరకు పాటుపడుతూ, ప్రజల సూచనలు పాటిస్తూ నాలుగో వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని అన్నారు. ముఖ్యంగా వీధిలైట్లు, డ్రైనేజీ, మరియు ప్రజలకు ఎలాంటి అసౌకర్యము కలగకుండా నిత్యము ప్రజలతో ఉండి, ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు వెళ్తానని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ జ్యోతి నిరంజన్, బిఆర్ఎస్ పార్టీ మండల యూత్ అధ్యక్షులు జంగిలి యాదగిరి, ఈదులపల్లి జగన్, పెద్ద ఆంధ్రయ్య, జంగిలి ప్రభుదాస్, జంగిలి శీను, జంగిలి తిరుపతయ్య, గోరేటి రాజు, టైలర్ వెంకటయ్య, గోరటి బొందయ్య, అంజయ్య, జంగిలి వెంకటయ్య, మట్ట బుచ్చయ్య, రాఘవేందర్, తదితరులు ఉన్నారు.