
పయనించే సూర్యుడు జనవరి 5 కరీంనగర్ న్యూస్: సంక్రాంతి పండుగ ముగ్గుల పండుగగా పిలుస్తారని మరియు సాంప్రదాయక కళారూపాలను ముగ్గులుగా పిలుస్తారని తద్వారా ఇంటికి సంపదను - శ్రేయస్సును తెస్తుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు & విఎన్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు "అల్ఫోర్స్" డా.వి.నరేందర్ రెడ్డి స్థానిక 45 డివిజన్లో గల ఒక ప్రైవేట్ పాఠశాలలో ఏర్పాటు చేసినటువంటి రంగవల్లికల పోటిల ముగింపు సమావేశానికి మరియు బహుమతులు ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై వారు మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రేయస్సును తెస్తుందని దుష్టశక్తులను నివారిస్తుందని వారు చెప్పారు అదేవిధంగా అద్భుతమైన ముగ్గులు వేసినటువంటి మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు సమాజ హితమైన కార్యక్రమాలు చేస్తున్న అజీమ్ ను అభినందిస్తూ భవిష్యత్తులో మరిన్ని చైతన్యవంతమైన కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు విశిష్ట అతిథిగా విచ్చేసిన ప్రముఖ విద్యావేత్త సింగమరాజు మాట్లాడుతూ ముగ్గులు సంక్రాంతి పండుగకు గొప్ప సూచికని మరియు ముగ్గుల ద్వారా పండుగ శోభ వెల్లివిరుస్తుందని మరియు గృహాలకు శోభ వస్తుందని వారు చెప్పారు మహిళలకు ప్రత్యేకమైనటువంటి పండగ సంక్రాంతి పండుగ అని గుర్తు చేస్తూ ప్రతి ఒక్కరు సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షిస్తూ సమాజ హితమైన కార్యక్రమాలకు చేయూతనివ్వాలని సూచించారు తెలంగాణ రాష్ట్ర విద్యా రంగంలో సంచలనాత్మక విజయాలను సాధిస్తూ మార్గదర్శకంగా నిలుస్తున్న అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. కరీంనగర్ సిటీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రజిత రెడ్డి మాట్లాడుతూ పల్లె సంస్కృతికి అద్దం పట్టేలా సంక్రాంతి పండుగను నిర్వహించుకోవాలని మరియు ప్రేమ ఆప్యాయతలతో కుటుంబ సభ్యులతో సమయాన్ని గడిపి సంక్రాంతి యొక్క వైభవాన్ని తెలుసుకోవాల్సి నటువంటి అవసరం ఎంతగానో ఉందని గుర్తు చేశారు. చాలా చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించిన అజీమ్ కు ధన్యవాదాలు తెలియజేశారు బహుమతులు గెలిచిన వారి వివరాలు 1. మొదటి బహుమతి - జే. సరిత - 5,000/- నగదు బహుమతి 2. ద్వితీయ బహుమతి - అరుణ - 3,000/- నగదు బహుమతి 3.తృతీయ బహుమతి - మమత - 2,000/- నగదు బహుమతి. 4. పాల్గొన్న మహిళలందరికీ ప్రోత్సాహకంగా చీరలను బహుకరించారు. 5. సుమారు 250 మంది మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 6. ఈ కార్యక్రమంలో విశ్వశాంతి పాఠశాల కరస్పాండెంట్ ఆంజనేయులు యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్యామ్ సుందర్ రెడ్డి మహిళా కాంగ్రెస్ నాయకురాలు గందె కల్పన మరియు డివిజన్ ప్రజలు పాల్గొన్నారు

