అంగరంగ వైభవంగా జరిగిన నీలకంఠేశ్వర స్వామి రథోత్సవం,,

పయనించేసూర్యుడు జనవరి 6 ఆదోని డివిజన్ ఇంచార్జ్ గుమ్మల బాలస్వామి నీలకంఠేశ్వర స్వామి ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు పట్టణంలో నీలకంఠేశ్వర స్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గుడిసి కృష్ణమ్మ ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి,మరియు మంత్రాలయం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి ఎన్.రాఘవేంద్ర రెడ్డి, తనయులు ఎన్.రాజా రెడ్డి పాల్గొని స్వామి దివ్య ఆశీస్సులు పొందారు.భక్తిశ్రద్ధలతో నిర్వహించిన రథోత్సవంలో పాల్గొని స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయ కమిటీ సభ్యులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.నీలకంఠేశ్వర స్వామి కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, సమృద్ధిగా ఉండాలని ఆకాంక్షించారు.