పయనించే సూర్యుడు, అశ్వాపురం, డిసెంబర్ 6: ఈ రోజు అశ్వాపురం గ్రామపంచాయతీ సర్పంచ్ బానోత్ సదర్ లాల్ అధ్యక్షతన అశ్వాపురం పంచాయతీ పరిధి లోని అంగన్వాడీ టీచర్స్, ఏ ఎన్ ఎం మరియు ఆశ వర్కర్ ల సాధారణ సమావేశం జరిగింది. అశ్వాపురం గ్రామపంచాయతీ లో వారి యొక్క సమస్యలు తెలుపమని కోరగా అంగన్వాడి స్కూల్స్ మరియు హెల్త్ సబ్ సెంటర్స్ కి సంబంధించి శిథిల వ్యవస్థలో ఉన్న భవనాలను లను తొలగించి, కొత్త భవనాలు మరియు ప్రహరీ గోడలు , లెట్రిన్ బాత్ రూమ్ నిర్మాణం కావాలి అని కోరడం జరిగింది. అవకాశాన్ని బట్టి మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శాసన సభ్యులు పాయం వెంకటేశ్వర్లు,మాజీ డి సి సి బి ఉపాధ్యకులు తుళ్లూరి బ్రహ్మయ్య ల దృష్టి కి మరియు పై అధికారుల దృష్టి కి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరిస్తానని సర్పంచ్ సదర్ లాల్ హామీ ఇచ్చారు, ఇట్టి కార్యక్రమంలో ఉపసర్పంచ్ తుళ్లూరు ప్రకాష్ రావు, కార్యదర్శి దాసరి మల్లేశం అంగన్వాడీ టీచర్స్, ఏ ఎన్ ఎం లు మరియు ఆశ వర్కర్ లు గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.