ఆయుర్వేద వైద్యుడు ఎండి జమాల్ ఖాన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అరుదైన అవార్డు సన్మానం

పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ జనవరి 6 పోలవరం జిల్లా చింతూరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భారత ప్రభుత్వం తరపున విశాఖపట్నంలో మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో గీతం యూనివర్సిటీలో 17వ ట్రైబల్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాం గత నెల డిసెంబర్ 30 తేదీ నుండి ప్రారంభమై ది .1/1/2026 సోమవారం ముగిసింది. సంయుక్తంగా ఏర్పాటు చేసిన సభలో ప్రముఖ ఆయుర్వేద వైద్యులు జెకెసి ట్రస్ట్ చైర్మన్ మహమ్మద్ జమాల్ ఖాన్ ముఖ్యఅతిథిగా ఆహ్వానించి అరుదైన అవార్డు మెమొంటో అందజేసి శాలువాతో సన్మానించడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ అఫేర్నెస్ ద్వారా జరిగిన సభలో ఫార్మర్స్ వైస్ ఛాన్స్లర్ ఆదికవి నన్నయ యూనివర్సిటీ డాక్టర్ ముర్రి ముత్యాల నాయుడు. అండర్ సెక్రెటరీ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెక్రెటరీ రాజకుమార్ డిప్యూటీ డైరెక్టర్ మై భారత్ విశాఖపట్నం మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జి మహేశ్వరరావు చేతులమీదుగా జమాల్ ఖాన్ కు మెమొంటోను అందజేసి శాలువాతో సన్మానించారు. విశాఖపట్నంలో మై భారత్ విశాఖపట్నం పేరుతో ఏర్పాటైన ఈ సభకు చత్తీస్గడ్ జార్ఖండ్ ఒరిస్సా రాష్ట్రాల నుండి స్పోర్ట్స్ అభిమానులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న మొహమ్మద్ జమాల్ ఖాన్ సభను ఉద్దేశించి మాట్లాడారు. యువకులు దేశానికి వెన్నెముకగా ఉంటారని యువశక్తి దేశానికి దిశ నిర్దేశం గా ఉంటూ బలీయంగా ఉండేటట్లు తోడ్పాటుగా ఉంటుందని అన్నారు. దేశ భవిత దేశ పురోభివృద్ధి, ప్రపంచ దేశాల్లో గుర్తింపు తేవాలన్న యువశక్తి పైనే ఆధారపడి ఉందన్నారు. దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులోయ్ అన్న గురజాడ మాటలు గుర్తు చేశారు. ప్రతి ఒక్క యువకుడు శారీరక దారుఢ్యం కలిగి ఉండాలని క్రమశిక్షణ దేశభక్తి మంచి ఆహారం అలవాట్లు అలవర్చుకోవాలన్నారు. నేడు దేశవ్యాప్తంగా ప్రజలను కలవర పెడుతున్న భయంకర వ్యాధులు వాటి నుండి జాగ్రత్తలు పాటించాలని ఆహార అలవాట్లను ఆరోగ్యానికి మేలు చేకూరేలా చేసుకోవాలని అప్పుడే మంచి ఆరోగ్యంతో పాటు భవిష్యత్తు కూడా సిద్ధిస్తుందని ఈ సందర్భంగా తెలిపారు. నేటి ఆధునిక కాలంలో యువత అన్ని రకాల రంగాలలో రాణిస్తుందని ప్రపంచ దేశాలకు తీసిపోని విధంగా ఎదగాలని మన భారత దేశంలో భారతీయుడుగా పుట్టి దేశ విదేశాల్లో సాంకేతికా రంగంలో దూసుకుపోతున్నారని తెలిపారు విజ్ఞానం వికాసమే భారత దేశ భవితవ్యం.. విజ్ఞానంతో పాటు వికాసమే భారత దేశ సౌభాగ్యత్వానికి భవితవ్యం అని ప్రతి ఒక్కరు గెలుపుని స్ఫూర్తిగా తీసుకొని దేశ భవిష్యత్తును ప్రపంచ దేశాల మూలలకు చాటేలా పాటుపడాలన్నారు. మేధావులు విద్యావంతులు గొప్ప సైంటిస్టులను ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాలని యువత దృష్టి తన ఎదుగుదలతో పాటు దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకువచ్చేలా ఆలోచనలో ఉండాలని ఒక్క ఆలోచన 100 మందిని కదిలించేలా ఉండాలన్నారు. భారతదేశంలో విద్యావంతులు మేధావులకు కరువు లేదని వారే మనకి ఆదర్శమని వారు చూపిన మార్గంలో నడిచినట్లయితే విజయం సిద్ధిస్తుందన్నారు. అనంతరం పలువురిని శాలువాలు మెమొంటోళ్లు అందించి సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అండర్ సెక్రెటరీ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జీ మహేశ్వర రావు డిప్యూటీ డైరెక్టర్ మై భారత విశాఖపట్నం మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ సెక్షన్ ఆఫీసర్ నాగేశ్వరరావు స్కూల్ ఆఫ్ జర్నలిజం న్యూఢిల్లీ నుండి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.