పయనించే సూర్యుడు జనవరి 06 ఉట్నూర్ మండలం ప్రతినిధి షైక్ సోహెల్ పాషా ఉట్నూర్ న్యూస్ టుడే:- ఉట్నూరులోని సన్ షైన్ పాఠశాలలో నిర్వహించిన ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఉట్నూర్ ఏఎస్పి కాజల్ సింగ్ ఉట్నూర్ సర్పంచ్ శ్రీమతి అనిత శ్రీనివాస్ జాదవ్ హాజరయ్యారు ఈ సందర్భంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన ఫుడ్ కోర్ట్‌ను ముఖ్యఅతిథులు సందర్శించి పరిశీలించారు అనంతరం విద్యార్థులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ.. కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలు సాధించాలని ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తాయని అన్నారు తరువాత పాఠశాల యాజమాన్యం సిబ్బంది ముఖ్య అతిథులను ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీమతి అనిత శ్రీనివాస్ జాదవ్ చిత్రపటాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో ఉట్నూర్ గ్రామపంచాయతీ ఉప సర్పంచ్ మసరత్ బేగం, వార్డ్ మెంబర్లు, పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
