ఉద్యమ నిరుద్యోగ కళాకారులకు ఉద్యోగ కల్పన

పయనించే సూర్యుడు జనవరి 6 ఎన్ రజినీకాంత్:- పేద ధూంధాం కళాకారులకు రాష్ట్ర ప్రభుత్వం గ్రామానికి న్యాయం చేసిందని భీమదేవరపల్లి మండలానికి చెందిన ధూమ్ దాం నిరుద్యోగ కళాకారుడు కనకం వెంకట్ పేర్కొన్నారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో నిరుద్యోగులుగా మిగిలిపోయిన పేద ధూం ధాం కళాకారులను ఆదుకోవాలని గత 12 ఏండ్లుగా సాగు తున్న పోరాటానికి ప్రజా ప్రభుత్వం న్యాయం చేసిందని, ఇచ్చిన మాట ప్రకారం జీవో ప్రవేశపెట్టి బిల్లు పాస్ చేసి కళాకారులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించిందన్నారు.. అనంతరం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, చైర్మన్ వెన్నెల గద్దర్ తోపాటు అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, నిరుద్యోగ కళాకారుల పక్షాన నిలబడ్డందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు