పయనించే సూర్యుడు జనవరి 6 నాగర్ కర్నూల్ జిల్లా రిపోర్టర్ కే. శ్రావణ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నాగర్ కర్నూల్ మున్సిపాలిటీకి సంబంధించిన 24 వార్డుల ముసాయిదా ఓటర్ల జాబితాను మున్సిపల్ అధికారులు విడుదల చేయగా, అందులో కొన్ని వార్డులు తారుమారయ్యాయి. ఉయ్యాలవాడ మున్సిపాలిటీలోని 7వ వార్డ్ కు సంబంధించిన సుమారు 360 ఓటర్లను ఎనిమిదో వార్డులోకి మార్చారు. ఇది చూసిన వార్డు సభ్యులు , వివిధ పార్టీల నాయకులు అవాక్కయ్యారు. సాంకేతిక తప్పిదమా, సిబ్బంది నిర్లక్ష్యమా, తగిన సమయం ఇవ్వకుండా ఎన్నికల సంఘం హడావిడిగా ముసాయిదా జాబితాను విడుదల చేయడమా అనేది అయోమయంలో పడ్డారు. వెంటనే వారు ఈ వార్డు ల సమస్యను మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డికి వివరించి వినతి పత్రం అందజేశారు. 7వవార్డు లోని ఓటర్లు 7వ వార్డ్ లోనే ఉండాలన్నారు. లేదంటే ఎన్నికలు బహిష్కరిస్తామని వార్డు సభ్యులు కమిషనర్ కు తెలిపారు. మున్సిపల్ కమిషనర్ వివరణ. మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి మాట్లాడుతూ సాంకేతిక లోపమా, సిబ్బంది నిర్లక్ష్యమా విచారణ చేపడుతామన్నారు.ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తగు న్యాయం చేస్తానని వార్డు సభ్యులకు హామీ ఇచ్చారు. ఇలాంటి సమస్య ఇంకోసారి జరగకుండా చూసుకుంటామన్నారు.