ఏ పేదవాడికి కష్టం వచ్చినా తనే ఉన్నానని భరోసా ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి.

పయనించే సూర్యుడు జనవరి 6 ఆదోని నియోజకవర్గం క్రైమ్ రిపోర్ట్ కృష్ణ. ఆదోని గడ్డపై ఏ పేదవాడికి కష్టం వచ్చినా తనే ఉన్నానని భరోసా ఇచ్చే మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ఆదోని పట్టణానికి చెందిన పాల్ అంజి మరణంతో పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ కుటుంబాన్ని పరామర్శించి, మట్టి ఖర్చుల నిమిత్తం 10,000 వేల రూ ఆర్థిక సాయం అందజేశారు. ఎన్ని రాజకీయాలు ఉన్నా, ప్రజల కష్టమే పరమావధిగా సాగే భీమిరెడ్డి కుటుంబం ఆదోని ప్రజల గుండెల్లో నిలిచిపోతుందని ఈ ఘటన మరోసారి రుజువు చేసింది.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి ఆదోని పట్టణ అధ్యక్షులు బి. దేవా, ప్రధాన కార్యదర్శి గంగాధర్, రామకృష్ణ, వేణు, శ్రీధర్, దానం, చిన్న వీరప్ప, కుప్పయ్య, భీమ, నల్లారెడ్డి, నాగరాజ్, ఉప్పరి నారాయణ మరియు ఇతర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.