కరీంనగర్ జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం నిర్వహించిన

★ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్న రెడ్డి

పయనించే సూర్యుడు జనవరి 6 కరీంనగర్ న్యూస్: జిల్లా అధ్యక్షురాలు కర్ర సత్య ప్రసన్న రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగింది ఇట్టి సమావేశం మహిళ సాధికారత పై చర్చించడం జరిగింది ఈ సందర్భంగా సత్యప్రసన్న మాట్లాడుతూ గ్రామ స్థాయి నుండి మహిళా కాంగ్రెస్ ను బలోపేతం చేయాలని రాబోయే మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు నాయకురాలు కష్టపడాలని పిలుపునిచ్చారు మహిళలు నిలుచున్న స్థానాలలో కాంగ్రెస్ పార్టీ తరుపున ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు రాబోయే ఎన్నికలలో కష్ట పడ్డ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులకు టికెట్స్ ఇచ్చే విధంగా కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా కరీంనగర్ జిల్లా నామినేటెడ్ పోస్టుల భర్తీలో కూడా మహిళా కాంగ్రెస్ లో కష్ట పడ్డ మహిళలకు సముచిత స్థానం దక్కే విధంగా ప్రయత్నం చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా మహిళా కాంగ్రెస్ ఇంచార్జ్ ,రాష్ట్ర మహిళా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గాజుల సుకన్య వంగల కళ్యాణి రెడ్డి నగర అధ్యక్షురాలు వెన్నం రజిత రెడ్డి మానకొండూర్ నియోజక వర్గ మహిళా కాంగ్రెస్ ఇంచార్జ్ కవ్వ పద్మ,కరీంనగర్ నియోజక వర్గ మహిళ కాంగ్రెస్ ఇంచార్జ్ హసీనా కరీంనగర్ జిల్లా మహిళా బ్లాక్ మండల పట్టణ అధ్యక్షులు కరీంనగర్ కార్పొరేషన్ డివిజన్ మహిళా అధ్యక్షులు,తదితర మహిళా నాయకులు పాల్గొన్నారు