కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయండి

★ అశ్వారావుపేట నియోజకవర్గ నాయకురాలు వగ్గెల పూజ పిలుపు

పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 6 అశ్వారావుపేట మండల రిపోర్టర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఈనెల జనవరి 7వ తేదీ బుధవారం నాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనకు విచ్చేస్తున్న నేపథ్యంలో, కొత్తగూడెంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు నిర్వహించ తలపెట్టిన నూతన గ్రామ ప్రజాప్రతినిధుల అభినందన సభను అత్యంత వైభవంగా విజయవంతం చేయాలని అశ్వారావుపేట నియోజకవర్గ నాయకురాలు వగ్గెల పూజ పిలుపునిచ్చారు. ఈ భారీ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరుకానున్న కేటీఆర్, కొత్తగా ఎన్నికైన గ్రామ ప్రజాప్రతినిధులను స్వయంగా శాలువాలతో సత్కరించి వారిని అభినందించనున్నారని, ఈ కార్యక్రమం పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపుతుందని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నియోజకవర్గంలోని మండల స్థాయి మాజీ ప్రజాప్రతినిధులు, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులతో పాటు పార్టీ సీనియర్ నాయకులు, విద్యార్థి మరియు యువజన విభాగం నాయకులు, మహిళా నాయకులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విభాగాల ముఖ్య నేతలు, సోషల్ మీడియా ప్రతినిధులు, ఉద్యమకారులు, కార్మిక సంఘాల నేతలు, కార్యకర్తలు మరియు అభిమానులు స్వచ్ఛందంగా, పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ అభినందన సభను గ్రాండ్ సక్సెస్ చేయాలని ఆమె కోరారు.