కోరుట్లలో మున్సిపల్ ఎన్నికల సందడి 15వ వార్డులో వీడియో ప్రచారంతో ఆకట్టుకుంటున్న నజ్జు

పయనించే సూర్యుడు, కోరుట్ల జనవరి 6 కోరుట్ల పట్టణంలో మున్సిపల్ ఎన్నికల వేడి అప్పుడే మొదలైంది. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ రాజకీయ పార్టీల్లో కదలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 15వ వార్డులో కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్న నజ్జు వినూత్న ప్రచార పద్ధతులతో ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాడు. సాంప్రదాయ ప్రచార విధానాలకు భిన్నంగా వీడియోల ద్వారా తన ఆలోచనలు, అభివృద్ధి ప్రణాళికలను ప్రజలకు వివరించేందుకు నజ్జు ప్రయత్నిస్తున్నారు. వార్డులోని అభివృద్ధి, తాగునీరు, రోడ్లు, పారిశుధ్యం వంటి సమస్యల పరిష్కారమే తన లక్ష్యమని ఆయన వీడియోలలో పేర్కొంటున్నారు. సోషల్ మీడియా వేదికగా సాగుతున్న ఈ ప్రచారం యువతతో పాటు అన్ని వర్గాల ఓటర్లను ఆకట్టుకుంటుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇలాంటి కొత్త తరహా ప్రచారాలు రాజకీయ వాతావరణాన్ని మరింత ఉత్కంఠగా మారుస్తున్నాయి.15వ వార్డులో నజ్జు చేపట్టిన ఈ వినూత్న ప్రచారం రానున్న ఎన్నికలపై ఎంత ప్రభావం చూపుతుందో చూడాల్సి ఉంది.