ఖయాదత్ యూత్  ఫౌండేషన్ ఆధ్వర్యంలో రేషన్ కిట్ల పంపిణీ

పయనించే సూర్యుడు జనవరి 06 ఉట్నూర్ మండలం ప్రతినిధి షైక్ సోహెల్ పాషా ఉట్నూర్ న్యూస్‌:- ఉట్నూర్ మండలంలో ఖయాదత్ యూత్ ఫౌండేషన్ (క్యూవైఎఫ్) ఆధ్వర్యంలో పేద మరియు అవసరమైన కుటుంబాలకు రేషన్ కిట్ల పంపిణీ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు కార్యక్రమం ద్వారా పలు కుటుంబాలకు మౌలిక ఆహార సరుకులు అందజేశారు ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వర్గాలకు సహాయంగా నిలవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ స్థాపకుడు మరియు అధ్యక్షుడు షేక్ తౌఫిక్ ఉపాధ్యక్షుడు హాఫిజ్ సజీద్ సిద్ధిఖీ న్యాయ సలహాదారు అడ్వొకేట్ అజర్ హష్మీ సలహాదారు నయీమ్ ప్రతినిధి వజీద్ ఖాన్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ముహీబ్ షైక్ సోహెల్ పాల్గొన్నారు కార్యక్రమం విజయవంతానికి సహకరించిన దాతలు స్వచ్ఛంద సేవకులకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.