గోరటి నిరంజన్ మృతి బాధాకరం

★ బహుజన మేధావి డాక్టర్ యేకుల రాజారావు

పయనించే సూర్యుడు జనవరి 6 (ప్రతినిధి గుమ్మకొండ సుధాకర్ డిండి మండలం నల్లగొండ జిల్లా) డిండి మండలం చెరుకుపల్లి గ్రామ పంచాయతీ చెందిన గోరటి నిరంజన్ అకాల మరణం బాధాకరం అని బహుజన మేధావి డాక్టర్ యేకుల రాజారావు మాల మహానాడు దేవరకొండ నియోజకవర్గం అధ్యక్షులు బోయిని చంద్రమౌళి అన్నారు. సోమవారం చెరుకుపల్లి గ్రామంలో వారి స్వగృహంలో నిరంజన్ మృత దేహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు పరామర్శించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరంజన్ మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు. గోరటి నిరంజన్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. వారి వెంట మాల మహానాడు గుండ్లపల్లి మండల అధ్యక్షులు నారిమల్ల మల్లేష్ ,మాల మహానాడు దేవరకొండ మండల అధ్యక్షులు బత్తుల దినాకర్, మాల మహానాడు సోషల్ మీడియా కోఆర్డినేటర్ చేపూరి మురళి, యర్ర వెంకటయ్య, బయ్య శ్రీను, చేపూరి శ్రీనివాస్, యర్ర తిరుపతయ్య గ్రామ ప్రజలు తదితరులున్నారు.