పయనించే సూర్యుడు, కోరుట్ల జనవరి 6 మోహన్ రావు పేట గ్రామంలోని అంగన్వాడీ సెంటర్–2 లో సోమవారం రోజు గ్రామ సర్పంచ్ సరికెల్ల లతిక నరేష్ ఆధ్వర్యంలో అన్నప్రాసన కార్యక్రమం,ఆరోగ్య లక్ష్మి కమిటీను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారుల ఆరోగ్యం, పోషణపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరాన్ని సర్పంచ్ వివరించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న పోషకాహారం, ఆరోగ్య సేవలు ప్రతి కుటుంబానికి చేరాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ జాన వెంకటేష్, కార్యదర్శి నరేష్,అంగన్వాడీ టీచర్ చిక్యాల పద్మ,సిబ్బంది, ఆరోగ్య లక్ష్మి కమిటీ సభ్యులు, ఆశా వర్కర్స్,గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.