పయనించే సూర్యుడు మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ సర్కిల్ జనవరి 6 ప్రతినిధి ఘట్కేసర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్‌గా విధులు నిర్వహించిన భాస్కర్‌కు మున్సిపల్ కార్యాలయ సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు. సోమవారం ఘట్కేసర్ సర్కిల్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ వాణి ఆధ్వర్యంలో వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సంతోష్ కుమార్ డీసీ భాస్కర్‌ను శాలువాతో సత్కరించి, మెమెంటో అందజేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ వాణి మాట్లాడుతూ.. భాస్కర్ తన పదవీకాలంలో నిబద్ధత, క్రమశిక్షణతో విధులు నిర్వహించారని కొనియాడారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపారని, తోటి సిబ్బందితో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేశారని ప్రశంసించారు. కార్యక్రమంలో పాల్గొన్న పలువురు అధికారులు మాట్లాడుతూ.. విధి నిర్వహణలో భాస్కర్ చూపిన ప్రతిభ అందరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఆయన చేపట్టబోయే కొత్త బాధ్యతల్లో మరింత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఘట్కేసర్ సర్కిల్ కార్యాలయ సిబ్బంది, వివిధ విభాగాల అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొని భాస్కర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమం అంతా స్నేహపూర్వక వాతావరణంలో ప్రశాంతంగా సాగింది.
