పయనించే సూర్యుడు జనవరి 6 ఆదోని నియోజకవర్గం క్రైమ్ రిపోర్టర్ కృష్ణ. ఏపీ బెస్త సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్గా బెస్త రామాంజనేయులు సోమవారం గొల్లపూడిలోని బీసీ భవన్లో ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ సమక్షంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రామాంజనేయులు మాట్లాడుతూ.. బెస్తల అభ్యున్నతికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్, ఆదోని నియోజకవర్గ ఇంచార్జి మీనాక్షి నాయుడులకు కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వం తెచ్చిన జీఓ 217ను రద్దు చేసి, ప్రత్యేక బడ్జెట్ కేటాయించడం ద్వారా కూటమి ప్రభుత్వం బెస్తల సంక్షేమానికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్ బొమ్మన శ్రీధర్, హౌసింగ్ డైరెక్టర్ అరెకల్ రామకృష్ణ, ఆదోని నియోజకవర్గ టీడీపీ నాయకులు మరియు బెస్త కులస్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
