పయనించే సూర్యుడు ప్రతినిధి ప్రత్తిపాడు నియోజవర్గం ఇంచార్జ్ ఎం. రాజశేఖర్, జనవరి, 6:- ప్రత్తిపాడు నియోజకవర్గ జనసేన పార్టీ నియోజకవర్గ మాజీ ఇన్చార్జ్ , మాజీ ఎంపీపీ, ఏలేశ్వరం మండలం, లింగంపర్తి గ్రామ వాసి అయిన వరుపుల తమ్మయ్య బాబు ఈరోజు అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించారు. వరుపుల తమ్మయ్య బాబు 2004 నుండి 2009 వరకు ఏలేశ్వరం ఎంపీపీగా సేవలందించారు. అంతేకాకుండా తమ్మయ్య బాబు 2019 సంవత్సరంలో జనసేన పార్టీ ఎమ్మెల్యే పదవికి ప్రత్తిపాడు నియోజకవర్గంలో పోటీ చేయడం జరిగింది. నాకు కష్టం వచ్చింది అని తన గుమ్మం తొక్కిన ప్రతి ఒక్కరికి, కులాలు, మతాలు, పార్టీలు అనేవి ఏమీ పట్టించుకోకుండా, ఎట్టి పరిస్థితుల్లోనూ న్యాయం చేస్తారని ఆయనకు నియోజకవర్గ వ్యాప్తంగా మంచి పేరుంది. ఆయన మరణ వార్త విని ప్రత్తిపాడు నియోజకవర్గ వ్యాప్తంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. నియోజకవర్గ వ్యాప్తంగా ఇటువంటి నాయకుడు మరి ఒకరు లేరని అనేకమంది వ్యాఖ్యానించడం ఈ సందర్భంగా విశేషం.