జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలు కెసిపి సిమెంట్ కర్మాగారంలో మెడికల్ క్యాంపు – యంవిఐ యంవియన్ నారాయణ రాజు

పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జీల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం జనవరి 6 జగ్గయ్యపేట మండలం ముక్త్యాల గ్రామంలోని ఈ రోజున 37 వ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా జగ్గయ్యపేట రవాణా శాఖ అధికారి యంవియన్ నారాయణ రాజు జగ్గయ్యపేట మండలం ముక్త్యాల గ్రామంలో గల కెసిపి సిమెంట్ కర్మాగారం లో భారీ వాహనదారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జగ్గయ్యపేట రవాణా శాఖ అధికారి యంవిఐ యంవియన్ నారాయణ రాజు వాహనదారులతో మాట్లాడుతూ వాహనాలను రాంగ్ రూట్ లో ఓవర్ లోడ్ తో ప్రయాణం చేయకూడదని, భారీ వాహనాల కాగితాలు అన్ని ఫోర్స్ లో ఉండేలా చూసుకోవాలని, డ్రైవర్ కి లైసెన్స్ డ్రైవింగ్ ఉండాలని,తప్పని సరిగా కాకి చొక్కాను ధరించాలని ఆయన తెలియజేసారు. సేఫ్టీ డ్రైవింగ్ చింత లేని కుటుంబంగా ఇంటికి డ్రైవర్ చేరుకోవచ్చని ఆయన అన్నారు. వాహనాలు నడిపేటప్పుడు ప్రతి ఒక్కరు సిగ్నల్స్ ని, రోడ్డు భద్రతను పాటించాలని ఆయన వాహనదారులకు తెలియజేశారు. అనంతరం డ్రైవర్లకు ఉచిత మెడికల్ క్యాంపు ని నిర్వహించారు. కెసిపి సిమెంట్ డిజియం పి.రామి రెడ్డి, సీనియర్ మేనేజర్లు కెయన్ కృష్ణా రెడ్డి, టి సోమేశ్వర రావు, డాక్టర్ పి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.