జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల అవగాహన సదస్సు

పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 6 బోధన్ : ఎడపల్లి మండల కేంద్రంలోని శ్రీ మాధవి స్కూల్ నందు జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా సోమవారం విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బోధన్ ఆర్టీవో శ్రీనివాస్ సిబ్బందితో కలిసి హాజరయ్యారు. అలాగే ఎడపల్లి ఎస్సై రమ విద్యార్థులకు రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నియమాల పాటింపు, హెల్మెట్ మరియు సీట్‌బెల్ట్ వాడకం ప్రాముఖ్యతపై వివరించారు. చిన్న వయస్సు నుంచే రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండాలని, నిబంధనలు పాటిస్తే ప్రమాదాలను తగ్గించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం మాధవి సురేష్ గౌడ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని సదస్సును విజయవంతం చేశారు.