పయనించే సూర్యుడు జనవరి 06 (మేడ్చల్ నియోజకవర్గం ప్రతినిధి మాధవరెడ్డి) బదిలీపై వెళ్లిన డిప్యూటీ కమిషనర్ భాస్కర్ రెడ్డి మరియు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సంతోష్ కుమార్కు జిహెచ్ఎంసి ఘట్కేసర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ వాణి రెడ్డి ఆధ్వర్యంలో వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు మాట్లాడుతూ, భాస్కర్ రెడ్డి తన పదవీకాలంలో పరిపాలనను సమర్థవంతంగా నిర్వహిస్తూ అభివృద్ధి కార్యక్రమాల అమలులో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు అలాగే డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సంతోష్ కుమార్ తన విధుల్లో నిబద్ధత క్రమశిక్షణతో పనిచేస్తూ శాఖ పనులకు మంచి గుర్తింపు తీసుకొచ్చారని ప్రశంసించారు. ఇద్దరూ అధికారులతో సమన్వయం ప్రజాసేవ పట్ల బాధ్యతాయుత దృక్పథంతో పనిచేశారని తెలిపారు. బదిలీ అనంతరం వారు మరిన్ని ఉన్నత స్థానాలకు చేరుకుని సేవలందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శాఖ అధికారులు సిబ్బంది పాల్గొని భాస్కర్ రెడ్డి సంతోష్ కుమార్లకు శుభాకాంక్షలు తెలిపారు వీడ్కోలు సమావేశం సానుకూల వాతావరణంలో ముగిసింది.