ట్రాన్స్ జెండర్లకు గుర్తింపు కార్డులను అందజేసి నజిల్లా కలెక్టర్ బి.యం సంతోష్

పయనించే సూర్యుడు తేదీ 6 జనవరి జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి బోయ కిష్టన్న జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టరేట్లో సోమవారం ఐడీఓసీ కలెక్టర్ ఛాంబర్ నందుమహిళా,శిశు,దివ్యాంగులు,వయోవద్ధుల శాఖ ఆధ్వర్యంలో ఎనిమిది మంది ట్రాన్స్ జెండర్లకు గుర్తింపు కార్డులు, ధ్రువపత్రాలను అందజేశారు. ఈ సంద ర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ట్రాన్స్‌జెండర్ వ్యక్తులకు సమాజంలో సమాన హక్కులు,గౌరవం,భద్రత కల్పిం చడమే ఈ గుర్తింపు కార్డు యొక్క ప్రధాన ఉద్దేశమని తెలిపారు.ఈ కార్డు ద్వారా ట్రాన్స్‌జెండర్ వ్యక్తులు ప్రభుత్వ సంక్షేమ పథకాలు,విద్యా సహాయం,ఉపాధి అవకాశాలు, ఆరోగ్య సేవలు వంటి అనేక సేవలను సులభంగా పొందవచ్చని పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న మొత్తం ఎనిమిది మంది ట్రాన్స్‌జెండర్ వ్యక్తులకు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పరిశీలన పూర్తి చేసి ట్రాన్స్‌జెండర్ సర్టిఫికెట్లు మరియు గుర్తింపు కార్డులను అందజేసినట్లు తెలిపారు. అర్హులైన ట్రాన్స్‌జెండర్ వ్యక్తులు సంబంధిత ప్రభుత్వ పోర్టల్ http://transge nder.dosje.gov.in/Applicant/Login ద్వారా దరఖాస్తు చేసుకుని ఈ గుర్తింపు కార్డును పొందాలని ఆయన సూచించారు. ప్రభుత్వం ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉందని,వారి సంక్షేమం కోసం కృషి చేస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి సునంద,ట్రాన్స్ జెండర్స్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *