తెలంగాణ, హుజురాబాద్ లో మళ్లీ మీరే రావాలి

★ ముఖ్యమంత్రిగా కేసీఆర్, ఎమ్మెల్యేగా కౌశిక్ రెడ్డి కావాలి. ★ రాజకీయ అభిమానాన్ని చాటుకున్న తాటిపాముల రమేష్.

పయనించే సూర్యుడు : జనవరి 6 : హుజురాబాద్ టౌన్ రిపోర్టర్ దాసరి రవి : హుజురాబాద్ పట్టణానికి చెందిన అయ్యప్ప భక్తుడు తాటిపాముల రమేష్ తన భక్తిని, రాజకీయ అభిమానాన్ని చాటుకున్నారు. 41 రోజులపాటు కఠినమైన అయ్యప్ప దీక్ష పూర్తి చేసుకున్న ఆయన శబరిమల యాత్రలో భాగంగా పంబా నుంచి సన్నిధానం వరకు ఇరుముడి మోస్తూ పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా రమేష్ తన యాత్రలో ఒక ప్రత్యేకమైన ఆకాంక్షను వెలిబుచ్చారు. తెలంగాణ రాష్ట్రం మళ్ళీ ప్రగతి పదంలో నడవాలంటే కేసిఆర్ మళ్ళీ తెలంగాణ ముఖ్యమంత్రి కావాలని, అలాగే హుజురాబాద్ నియోజకవర్గం అభివృద్ధి కోసం పాడి కౌశిక్ రెడ్డి మళ్ళీ ఎమ్మెల్యేగా విజయం సాధించాలని కోరుకుంటూ సన్నిధానంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.దీనికి సంబంధించిన ఫ్లెక్సీ ని పట్టుకొని ఆయన కొండపైకి ప్రదర్శించిన తీరు అందరి దృష్టిని ఆకర్షించింది. స్వామివారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరికీ మేలు జరగాలని, తన అభిమానా నాయకులు ఉన్నత పదవుల్లో ఉండి ప్రజలకు సేవ చేయాలని మనసారా మొక్కుకున్నట్టు రమేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు మాలాధారణలో ఉన్న తోటి స్వాములు పాల్గొన్నారు.