త్యాగమూర్తుల త్యాగాలను గుర్తిస్తున్న కూటమి ప్రభుత్వం కంకటాల రాముo

ప్రయనించే సూర్యుడు జనవరి 6 ముమ్మిడివరం ప్రతినిధి అమలాపురం రూరల్ మండలం వన్నె చింతలపూడి గ్రామంలో క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొనటానికి విచ్చేసిన రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణ రాజు వారి ని రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కంకటాల రామం కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆర్యవైశ్య కులదైవమైన వాసవి మాత జన్మస్థలమైన పెనుగొండను వాసవి పెనుగొండ గా మార్చడం అంతేకాకుండా రాష్ట్ర రాజధాని అమరావతిలో సుమారు 7 ఎకరాల స్థలం కేటాయించి స్టాట్యూ ఆఫ్ శాక్రిఫై పేరుతో పొట్టి శ్రీరాములు గారు స్మృతి వనం ఏర్పాటు చేసి 58 అడుగుల పొట్టి శ్రీరాములు వారి కాంస్య విగ్రహం ఏర్పాటు చేసి మార్చి నెలలో జాతి అంకితం చేయడమే కాకుండా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోట్లాది రూపాయలు వెచ్చించి లక్షలాది కుటుంబాలకు దాహార్తిని తీర్చే పథకానికి ఇటీవల ప్రారంభోత్సవం చేసిన జలపథకానికి అమరజీవి జలపథకముగా నామకరణం చేయడం ఆర్యవైశ్యుల తో పాటు త్యాగాన్ని గుర్తించే అన్ని వర్గాల వారు సంతోషిస్తున్నారని తెలుపుతున్న సందర్భముగా.